వామ్మో.. అలాంటి వారు జామపండును అస్సలు తినకూడదంట..
రుచికరమైన జామపండులో అనేక పోషకాలు దాగున్నాయి. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి ఇది ఔషధం కంటే తక్కువేమి కాదు.
కొంతమంది వ్యక్తులు జామపండును తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జామ శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కావున జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలున్న వారు తినకూడదు.
దురద, తామరతో బాధపడుతున్న వ్యక్తులు జామపండును తినకూడదు.
జీర్ణశయాంతర సమస్యలను ఎదుర్కొంటున్నవారు ఈ పండుకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది కడుపు నొప్పి, వాంతులు కలిగిస్తుంది.
గర్భిణులు, పాలిచ్చే తల్లులు జామపండుకు దూరంగా ఉండాలి. ఇది ఆమె, పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.
ఏదైనా ఆపరేషన్ లేదా శస్త్రచికిత్స చేయబోతున్నట్లయితే 2 వారాల ముందుగానే జామపండు తినడం మానేయాలి.