జామాకుల్లోని ఔషధ గుణాలు జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి

జామాకుల్లో విటమిన్ 'సి'  కొలాజెన్ ఉత్పత్తిని పెంచి, జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది

ముఖ్యంగా చుండ్రు నివారణకు జామాకులతో తయారుచేసుకున్న హెయిర్‌ ప్యాక్‌ మంచి ఫలితాన్నిస్తుంది

ముందుగా జామాకులను బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి

దీనిలో కొద్దిగా నీళ్లను కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి

ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి పావుగంట ఆరనివ్వాలి

ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో తల స్నానం చెయ్యాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గుతుంది