హీరో గోపీచంద్ కన్నడ దర్శకుడు ఎ.హర్ష దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రాన్ని కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.
గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించారు మూవీ మేకర్స్.
ఈ చిత్రాన్ని ‘భీమా’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్రబృందం.
ఈ మేరకు ఓ ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు.
ఆ పోస్టర్‌లో రగ్గడ్ లుక్‌లో శక్తిమంతమైన పోలీస్ అధికారిగా ఆవేశంతో చూస్తూ ఆసక్తికరంగా కనిపించారు గోపీచంద్.
‘‘కుటుంబ భావోద్వేగాలు, ఇతర వాణిజ్యాంశాలతో నిండిన భారీ యాక్షన్ చిత్రమిది.
గోపీచంద్ పాత్ర చాలా వైల్డ్‌గా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ భారీ పోరాట ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నాం.
త్వరలో కథానాయిక, ఇతర వివరాలు వెల్లడిస్తాం’’ అని తెలిపాయి చిత్ర వర్గాలు.
ఇటీవలే రామబాణం చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు గోపీచంద్.