నిద్రపోయే ముందు ఎక్కువ వెలుతురు లేకుండా చూసుకోవాలి.

నిద్రపోయే గదిలో ఎక్కువ వెలుతురు అందించే బల్ప్‌ను ఆపివేయాలి.

నిద్రపోయే ముందు స్మార్ట్‌ ఫోన్‌, ల్యాప్టాప్‌ వంటి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ కి దూరంగా ఉండాలి.

ఇలా చేయడంతో కంటిపై ఒత్తిడి తగ్గుతుంది చక్కని నిద్ర వస్తుంది.

నిద్రపోవడానికి ఐదు గంటల నుంచి కాఫీ, టీలు తాగవద్దు.

వీటిలో ఉండే కెఫైన్‌ శరీరాన్ని ఉత్తేజంగా మార్చుతుంది. నిద్రను పాడుచేస్తుంది.

నిద్రపోయే ముందు ఆల్కాహాల్‌ కి దూరంగా ఉండాలి. ఆల్కాహల్‌ మత్తు పదార్థమే అయినప్పటికీ సరైన నిద్రను అందించదు.

నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందు ఆహారాన్ని తీసుకోవాలి.

ఇలా చేయడంతో ఆహారం జీర్ణమై కడుపు తేలికగా మారుతుంది.