అక్షయ తృతీయ రోజును హిందువులు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తుంటారు. ఆ రోజున బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందనే నమ్మకం అనాదిగా కొనసాగుతోంది.
ఆ కారణంగానే ఏప్రిల్ 22 జరిగిన అక్షయ తృతియ వేళ బంగారం అమ్మకాలు జోరుగా సాగాయి.
బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఏమాత్రం పట్టించుకోకుండా పోటీపడి మరీ బంగారు ఆభరణాలను కొనుగోలు చేశారు.
ఇక్కడ విశేషమేమిటంటే.. అక్షయ తృతీయ రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.62,500 గా ఉన్నా కూడా పసిడి అమ్మకాలు దాదాపు 40 శాతం పెరిగాయి.
ఇక్కడ విశేషమేమిటంటే.. అక్షయ తృతీయ రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.62,500 గా ఉన్నా కూడా పసిడి అమ్మకాలు దాదాపు 40 శాతం పెరిగాయి.
ఈ సంవత్సరం ముఖ్యంగా యువత అక్షయ తృతీయ రోజున బంగారం కంటే వజ్రాలను ఎక్కువగా కొనుగోలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి.
మరోవైపు ఈ ఏడాది అక్షయ తృతియ రోజున బంగారు ఆభరణాల అమ్మకాలు 40 శాతానికి పైగా పెరిగాయని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సాయం మెహ్రా తెలిపారు.
ప్రజలు డబ్బు విషయంలో ఎక్కువ ఒత్తిడికి గురవకుండా అక్షయ తృతీయను జరుపుకోవాలని కోరుకోవడం వల్ల తేలికపాటి ఆభరణాలకు డిమాండ్ బాగా పెరిగిందని ఛైర్మన్ మెహ్రా పేర్కొన్నారు.