గోవా మద్యంప్రియులకు మాత్రమే కాదు, హనీమూన్ జరుపుకునేవారికి ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్. నిత్యం వేలాది మంది పర్యాటకులు గోవాకు వెళ్తుంటారు.
గోవాలో బీచ్‌లో ఎంజాయ్ చేయడానికి వచ్చే వారు కొందరైతే, మద్యం తాగి ఎంజాయ్ చేసేవారు ఇంకొందరు.
అయితే గోవాకు వచ్చే పర్యాటకుల్లో కొద్ది మంది తీరు వల్ల ఇతర పర్యాటకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గోవా ప్రభుత్వం కొత్త నియమనిబంధనల్ని తీసుకొచ్చిది.
బీచ్ సమీపంలో వంటలు చేయడాన్ని కూడా నిషేధించింది ప్రభుత్వం.
బీచ్‌లో తాము ఫోటోస్ దిగొచ్చు కానీ, ఇతరుల అనుమతి లేకుండా వారి ఫోటోస్ క్లిక్ చేయకూడదు.
బీచ్‌లో ఎక్కడపడితే అక్కడ మద్యం సేవించకూడదు.
లైసెన్స్ పొందిన రెస్టారెంట్లు, హోటళ్లలోనే మద్యం సేవించాలి. ఈ రూల్స్ పాటించకపోతే రూ.50,000 ఫైన్ చెల్లించాలి.