అల్లంలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో జింజర్ టీని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.

అల్లం టీలో ఆరోగ్యానికి మేలు చేసే ఐరన్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి.

అల్లం టీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులతో పోరాడే శక్తిని పెంచి, అంటు వ్యాధులను, జలుబు, దగ్గు వంటి వాటిని నయం చేస్తుంది.

చలికాలంలో రక్త ప్రసరణ బాగా దెబ్బతింటుంది. అల్లం టీ తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

అల్లం టీలో ఉండే లక్షణాలు ఆందోళన, అలసట నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

అల్లం టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. శరీర బరువు కూడా తగ్గుతుంది.

అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వాపు, నొప్పుల నుంచి ఉపశమనం పొందేలా చేస్తాయి.