శీతాకాలం ప్రారంభమైంది. ఈ సమయంలో దగ్గు, జలుబు, ఫ్లూ లాంటి వైరల్ సమస్యలు పెరుగుతాయి.
చలికాలంలో కీళ్ల నొప్పుల సమస్యలు, నీరసం లాంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి
ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు అల్లం తీసుకోవడం మంచిది
అల్లంలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి
అల్లంలో విటమిన్ బీ6, మెగ్నీషియం, ఐరన్ కూడా ఉన్నాయి
అల్లం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. దీంతోపాటు పలు వ్యాధుల నుంచి కూడా దూరంగా ఉంచుతుంది
శరీరం వెచ్చగా ఉండాలంటే.. అల్లం టీని కూడా తాగవచ్చు. అందుకోసమే.. రెగ్యులర్ గా మీ ఆహారంలో అల్లం చేర్చుకోవడం మంచిది.