యుక్త వయస్సులో చాలామంది మొహంపై మొటిమలతో బాధపడుతుంటారు
చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండటానికి మీరు పండ్ల రసాల సహాయం కూడా తీసుకోవచ్చు
క్యారెట్‌ను ముఖానికి అప్లై చేస్తే.. మెరిసే అందం మీ సొంతం అవుతుంది
ముందు క్యారెట్ రసాన్ని తీసి అందులో దూదిని నానబెట్టండి
ఇప్పుడు నెమ్మదిగా ముఖంపై అప్లై చేయాలి
ఇలా చేసిన 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరి రసం చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది
ఇందులో ఉన్న విటమిన్ సి చర్మాన్ని లోపలి నుండి మెరిసేలా చేస్తుంది. ఈ రసాన్ని వారానికి రెండు సార్లు ముఖానికి పట్టిస్తే మంచిది