మారుతున్న కాలంలో మారిన అలవాట్లు, వాతావరణ కాలుష్యం తో చర్మం పై టాన్ పేరుకుపోవడం, ముడతలు వంటి అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి
అయితే విటమిన్-ఇ చర్మానికి మేలు చేస్తుంది. అందాన్ని మరింత మెరుగుపరుస్తుంది
ఈ నేపథ్యంలో విటమిన్-ఇ ఆయిల్ ఎలా ఉపయోగించాలి ఈరోజు తెలుసుకుందాం
ముందుగా చర్మం పై మేకప్ లేదా క్రీమ్ వంటివి ఉంటే రిమూవ్ చేయండి. అనంతరం ముఖాన్ని గోరు వెచ్చటి నీటిలో శుభ్రం చేసుకోండి
అనంతరం మెత్తటి గుడ్డతో చర్మాన్ని సున్నితంగా తుడుచుకోవాలి. అనంతరం విటమిన్-ఇ ఆయిల్ అప్లై చేయాలి
స్వచ్ఛమైన విటమిన్-ఇ ఆయిల్ లేదా క్యాప్సూల్స్‌ను ఉపయోగిస్తుంటే 10 చుక్కల జోజోబా ఆయిల్ లేదా కొబ్బరి నూనెకు ఒకటి లేదా రెండు చుక్కల విటమిన్-ఇ ఆయిల్ జోడించండి
ఈ మిక్స్డ్ ఆయిల్ లేదా సీరమ్‌ని చర్మంపై అప్లై చేసి అనంతరం ముఖాన్ని ముని వేళ్లతో వృత్తాకారంలో మసాజ్ చేయండి. అప్పుడు ఆయిల్ చర్మంలోకి చేరుకుంటుంది
ఆయిల్ అప్లై చేసి 20 నిముషాల అనంతరం ముఖాన్ని గోరు వెచ్చటి నీటితో శుభ్రంచేసుకోండి. ఇలా వారానికి ఒకసారి ముఖానికి ఈ విటమిన్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు
ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఫేస్ కు అప్లై చేయడం వలన మొటిమలు తగ్గుతాయి