చేప మాంసం తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు
దీని వల్ల ఆస్తమాకు చెక్ పెట్టొచ్చని డాక్టర్స్ అంటున్నారు
హృద్రోగ సమస్యలున్న వారు కూడా చేప మాంసం తినడం చాలా మంచిదని వారి సలహా
శాస్త్రవేత్తలు సౌతాఆఫ్రికాలోని ఓ గ్రామానికి చెందిన 600 మందిపై పరిశోధన చేయగా ఈ విషయం వెల్లడైంది
ప్రస్తుతం మార్కెట్ లో లభించే మందుల వల్ల ఆస్తమా రోగులకు ఎలాంటి ఉపశమనం లభించట్లేదు
చేపల ద్వారా లభించే ఎన్-3 పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ తీసుకున్న వారిలో ఆస్తమా సంబంధిత సమస్యలు 62 శాతం వరకు తగ్గినట్లు గుర్తించాం అని వారు అన్నారు