తేనెలో చర్మాన్ని సుసంపన్నంగా చేసే గుణాలు ఉన్నాయి. అందానికి సంబంధించిన సమస్యలను తేనె తో పరిష్కరించవచ్చు

అనవసరమైన ఖర్చు చేసి  బ్యూటీ పార్లర్ కి వెళ్లకుండా ఇంట్లోనే తేనెతో ఫేషియల్స్ చేసుకోవచ్చు.

తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి 

కాబట్టి ఫేషియల్ కు  ముందు తేనెతో మొఖాన్ని శుభ్రం చేసుకోండి .

ముందుగా మొఖాన్ని శుభ్రంగా నీళ్లతో కడుక్కోవాలి. తర్వాత తడిగా ఉన్న మొఖం, మెడ పై పలుచని తేనె రాసుకోవాలి.

20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి.

కీరదోస రసాన్ని తేనెతో కలిపి మొఖ, మెడ పై స్ప్రే చేసి దూదితో రుద్దండి .

ఒక గిన్నెలో తేనె, పంచదార పొడిని బాగా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని తేమగా ఉన్న అన్ని ప్రాంతాలలో అప్లై చెయ్యండి.