హా హా హాసినీ అనగానే మనకు గుర్తొచ్చే హీరోయిన్‌ జెనీలియా.

ఒకప్పుడు తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగిన జెనీలియా పెళ్లి తర్వాత నటనకు దూరమయ్యింది.

బాలీవుడ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన ఆమె ముంబైలోనే ఉంటూ అక్కడే సెటిల్‌ అయ్యింది

ఇటీవలె వేద్‌(మజిలీకి రీమేక్‌)సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన జెనీలియా సాలిడ్‌ హిట్‌ను సొంతం చేసుకుంది.

పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు పోషించాలనుకున్నా. ఇల్లాలిగా, పిల్లలకు మంచి తల్లిగా పూర్తి సమయం కేటాయించాలనుకున్నా.

అందుకే సినిమాలకు దూరమయ్యా. ఇక రీసెంట్‌గా వేద్‌ సినిమా విజయం నాలో కొత్త ఉత్సానిచ్చింది.

ఇన్నేళ్ల తర్వాత కూడా ఆడియెన్స్‌ నన్ను నటిగా ఆదరించారు. మళ్లీ మంచి కథలు దొరికితే తప్పకుండా నటిస్తా అంటూ చెప్పుకొచ్చింది.