సైబర్ నేరగాళ్ల ఆటలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. నెటిజన్లను మోసపోయేలా చేస్తున్నాయి.

అయితే సైబర్‌ పోలీస్‌ విభాగం ఇలాంటి మోసాలపై ఎంత అవగాహన కల్పించినా.. నెటిజన్లు మాత్రం జాగ్రత్తగా ఉండడం లేదు.

అయితే సైబర్‌ పోలీస్‌ విభాగం ఇలాంటి మోసాలపై ఎంత అవగాహన కల్పించినా.. నెటిజన్లు మాత్రం జాగ్రత్తగా ఉండడం లేదు.

ఫారెన్ నెంబర్‌తో.. సెలబ్రిటీల ఫోటోలతో.. వాట్సాప్‌ చాట్‌లు చేస్తున్నారు.. అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. వారి వారి పర్సనల్ డాటాను కూడా రాబడుతున్నారు.

అలా తాజాగా తన పేరుతో సైబర్‌నేరగాళ్లు వాట్సాప్ చాట్‌ చేస్తున్నారని అందర్నీ వార్న్‌ చేశారు స్టార్ సింగర్ గీతామాధురి

తన పేరు మీదు ఆన్‌లైన్‌ మోసాలు జరుగుతున్నాయాని సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు గీతామాధురి.

తన ప్రొఫైల్ పిక్ ఉన్న ఓ అమెరికా నెంబర్‌తో వాట్సాప్‌ మెసేజులు వస్తున్నాయని.. ఆ మెసేజ్‌లకు రెస్పాండ్ అవ్వద్దని తన ఫ్యాన్స్ ను కోరారు.