ప్రస్తుతం ఎక్కడ చూసినా నాటు నాటు సాంగ్ ఫీవర్ కనిపిస్తోంది.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అవ్వడంతో..
ఈ పాటలో అద్భుతంగా డ్యాన్స్ చేసిన తారక్, రామ్‌చరణ్ పేర్లు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతున్నాయి.
ఈనెల 13న 95వ ఆస్కార్ అకాడమీ అవార్డులను ప్రకటించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే జక్కన్న, ఎన్టీఆర్, చెర్రీ తదితరులు ఇప్పటికే లాస్ ఏంజెలిస్ చేరుకున్నారు.
ఈ క్రమంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు కూడా ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్ రావాలని బలంగా కోరుకుంటున్నారు.
అంతేకాక ఆ పాటలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై ఆయన చేసిన కామెంట్స్ ఇరువురి ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తుతున్నాయి.
‘ఇకఈ పాటలో ఆ ఇద్దరి నటులు (తారక్, చెర్రీ) నటన ఎలా ఉందంటే..రెండు వేర్వేరు కుటుంబాల్లో పుట్టిన మహానటులు ఇద్దరూ అటువంటి అద్భుత నటన ప్రదర్శించారంటే..
వాళ్లు నా కంటే చిన్నవాళ్లైనా సరే.. ఇద్దరికీ నమస్కారం చేస్తున్నాను’ అంటూ ప్రశంసలు కురిపించారు గరికపాటి. ఇక చివర్లో ‘నేను కాస్త కష్టపడితే ఈ పాట రాయగలనేమో కానీ..
వాళ్లలాగా నేను ఎగరలేను కదా అని అనిపించింది నాకు’ అంటూ తనదైన శైలిలో ఛలోక్తులు విసిరారు గరికపాటి. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో బాగా వైరల్ అవుతోంది.