గంగోత్రిలోని వల్లంకి పిట్ట పాట ఎంత హిట్టో అందులో నటించిన పాప కూడా అంతే ఫేమస్‌

తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్న ఆ చిన్నారి ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌గా మారిపోయింది

 తాజాగా విడుదలైన మసూద అనే సినిమాలో హీరోయిన్‌గా నటించిన కావ్య కల్యాణ్‌ రామ్‌నే ఆ చిన్నారి

గంగోత్రి తర్వాత ఠాగూర్‌, స్నేహమంటే ఇదేరా, బాలు తదితర సినిమాల్లో నటించింది కావ్య

సుమారు 16 చిత్రాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది

తాజాగా మసూద సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది

ఇందులో కావ్య అందం, అభినయానికి  మంచి మార్కులు పడ్డాయి