Team India: ఈ స్టార్ క్రికెటర్లు వాళ్ల భార్యల కన్నా చిన్నోళ్లు.. లిస్టులో 5గురు..

భారతీయ క్రికెటర్ల వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో నిరంతరం చర్చలు నడుస్తుంటాయి.

ఇలాంటి లిస్టులో 5 గురు భారతీయ క్రికెటర్లు ఉన్నారు. ఈ ప్లేయర్ల భార్యలు ఏజ్‌లో పెద్దవారు కావడం గమనార్హం.

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ని రెండోకసారి పెళ్లి చేసుకున్నాడు.

వారిద్దరూ మొదట మే 31, 2020న వివాహం చేసుకున్నారు. నటాషా సెర్బియా మోడల్. ఆమె హార్దిక్ కంటే 7 నెలలు పెద్దది.

టీమిండియా మాజీ వెటరన్ సచిన్ టెండూల్కర్ మే 24, 1995న అంజలిని వివాహం చేసుకున్నారు.

సచిన్ టెండూల్కర్ కంటే అంజలి 6 సంవత్సరాలు పెద్దది. పెళ్లి నాటికి సచిన్ టెండూల్కర్ వయసు 22 ఏళ్లు.

భారత జట్టు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ 2012లో అయేషా ముఖర్జీని పెళ్లాడాడు. ధావన్ తన కుటుంబ సభ్యులను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు.

శిఖర్ ధావన్ కంటే అయేషా పదేళ్లు పెద్దది. కాగా, సెప్టెంబర్ 2021లో విడిపోయారు. ఇద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ 2017 డిసెంబర్ 17న ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. విరాట్ కోహ్లీ కంటే అనుష్క శర్మ 6 నెలలు పెద్దది.

భారత జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం గాయం కారణంగా జట్టుకు దూరమవుతున్నాడు.

బుమ్రా వ్యాఖ్యాత సంజనా గణేశన్‌ను వివాహం చేసుకున్నారు. బుమ్రా కంటే సంజన రెండు సంవత్సరాల ఏడు నెలలు పెద్దది.