పిండి పదార్థాలు, ప్రోటీన్లలతో పోలిస్తే కొవ్వులు శరీరంలో నెమ్మదిగా జీర్ణం అవుతాయి. ఓ అధ్యయనం ప్రకారం వేయించిన ఆహారాన్ని తింటే కడుపు నొప్పి వస్తుందట

చిప్స్‌లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్... చెడు కొవ్వును పెంచుతుంది. తద్వారా గుండెకు రక్త సరఫరా సరిగా సాగదు. తద్వారా గుండెపోటు రావచ్చు.

 ఫ్రైలు, చిప్సూ వంటివి తరచూ తింటే... ఇలా పెరిగిన ఇమ్యూనిటీ, అలా పోతుంది. 

వేయించిన ఆహారాన్ని వారానికి 3 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు తింటే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు 7 శాతం పెరుగుతాయని ఓ అధ్యయనంలో తేలింది. 

 ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో రాసిన అధ్యయనం ప్రకారం వేయించిన ఆహారాన్ని తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది.