ప్రపంచాన్ని చూడడానికి కళ్ళు మనకు సాధనం. కానీ నేటి కాలంలో ప్రజలు గంటల తరబడి కంప్యూటర్ లేదా ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ ఉంటారు
దీని వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి. ఇది కాకుండా వయస్సు సంబంధిత కారకాలు, వ్యాధికి గురికావడం కూడా మన కళ్ళపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి
వీటిలో , కళ్లు ఎర్రబడడం, కళ్లు అలసిపోవడం, కళ్లలో కొన్ని మచ్చలు కనిపించడం వంటి సమస్యలు ఉన్నాయి
వృద్ధాప్యంలో కూడా మీ కళ్ళు షార్ప్‌గా ఉండాలంటే ఇక్కడ 4 జాగ్రత్తలు ఉన్నాయి
కంటి పరీక్షల ద్వారా అద్దాలు అవసరమా కాదా అని మాత్రమే కాకుండా, ముందుగానే గుర్తిస్తే సమర్థవంతంగా చికిత్స చేయగల కంటి వ్యాధులను కూడా గుర్తించవచ్చు
కంప్యూటర్ స్క్రీన్, మొబైల్ స్కీన్‌లు కళ్లకు కనీసం 20-24 అంగుళాల దూరంలో ఉంచండి. స్క్రీన్‌పై కాంతిని తగ్గించండి. తరచుగా కళ్లను బ్లింక్ చేయండి. ప్రతి గంటకు కనీసం 10-15 నిమిషాలు విరామం తీసుకోండి
కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి
మీరు బాగా నిద్రపోయినప్పుడు, శరీరం కోలుకోవడానికి తగినంత సమయం లభిస్తుంది. కళ్ళు పునరుత్పత్తికి తగినంత సమయం లభిస్తుంది