కత్రినా కైఫ్: ‘మల్లీశ్వరి’ చిత్రం తో తెలుగు వారికీ పరిచయం అయిన కత్రినా బ్రిటిష్ దేశస్తురాలు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారింది.
సన్నీలియోన్: పంజాబీ కుటుంబానికి చెందిన సన్నీ లియోన్ కెనెడా లో పుట్టి పెరిగింది. తెలుగులో మంచు మనోజ్ సరసన ‘కరెంట్ తీగ’, మంచు విష్ణు సరసన ‘జిన్నా’ చిత్రాల్లో నటించింది.
అమీ జాక్సన్: ఎవడు’ చిత్రం తో టాలీవుడ్ కి పరిచయం అయిన అమీ జాక్సన్ బ్రిటిష్ దేశస్థురాలు.
సవికా ఛాయవేజ్: సుమంత్ హీరోగా చంద్ర సిద్దార్థ తెరకెక్కించిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ చిత్రం లో థాయ్ నటి సవికా హీరోయిన్ గా నటించింది.
క్రిస్టీనా అఖీవా: ఆది సాయికుమార్ హీరో గా నటించిన గాలిపటం చిత్రం లో ఆస్ట్రేలియా నటి, మోడల్ క్రిస్టినా అఖీవా నటించింది.
ఒలీవియా మోరిస్: రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం తో ఒలీవియా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈమె లండన్ కు చెందిన నాటక కళాకారిణి.
మరియా రాబోష్ప్క: జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తెరకెక్కించిన ‘ప్రిన్స్’ చిత్రం లో తమిళ్ హీరో శివ కార్తికేయన్ సరసన మరియా రాబోష్ప్క నటించింది.
నర్గిస్ ఫక్రి: గత కొంత కాలం గా బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న అమెరికన్ భామ నర్గిస్ ఫక్రి ‘ హరి హర వీర మల్లు’ చిత్రం తో టాలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది.
జెన్నిఫర్ పిచినెతో: విలక్షణ నటుడు సత్యదేవ్ నటించనున్న రాసుపరి చిత్రం లో బ్రెజిల్ కి చెందిన జెన్నిఫర్ పిచినెతో నటిస్తోంది.
షెర్లీ సెటియా: నాగ శౌర్య హీరోగా వచ్చిన ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రం ద్వారా న్యూజిలాండ్ నటి, గాయని షెర్లీ షెటియా టాలీవుడ్ లో అడుగు పెట్టింది.