శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’
గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలు ప్రేక్షకులను ఆకర్షించాయి
‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అంటూ మూడో చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు
టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నా ఈ మూవీలో హీరోయిన్ గా మాళవిక నాయర్ నటిస్తుంది
సోమవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది
అందులో నాగశౌర్య, మాళవిక ఇద్దరూ ప్రయాణంలో ఒకరిపై ఒకరు వాలిపోయి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ వింటూ కనిపించారు
ఒక దశాబ్దం పాటు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వయస్సు వరకు ఓ జంట మధ్య ఆసక్తికరంగా సాగే ప్రేమ ప్రయాణం ఈ చిత్రం
‘‘ఈ చిత్రంలో ప్రేమను ఇంద్రధనస్సులా ఏడు విభిన్న రంగులలో ప్రదర్శించనున్నాం. ఈ సినిమాకి సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల చెప్పారు