కొన్ని పదార్థాలను ఆహారంలో చేర్చుకుంటే జ్ఞాపకశక్తి కంప్యూటర్ లాగా వేగంగా మారుతుంది..

మన మెదడు పనిచేయడానికి పోషకాహారం అవసరం. పోషకాల కొరత జ్ఞాపకశక్తిపై చెడు ప్రభావం చూపుతుంది.

బాదం, వాల్‌నట్ వంటి డ్రైఫ్రూట్స్ మెదడుకు మేలు చేస్తాయి. వీటిలోని విటమిన్ ఇ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు పదును పెడుతాయి.

ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మెదడు కణాలు బలపడతాయి.

ప్రొటీన్లు, పీచుపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్న తృణ ధాన్యాలు మెదడు ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి.

చేప మెదడుకు చాలా మేలు చేస్తుంది. సాల్మన్, ట్యూనా ఫిష్‌లలో ఉండే పోషకాలు మెదడును బలోపేతం చేస్తాయి.

పోషకాలు అధికంగా ఉండే ఓట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. విటమిన్ ఇ, విటమిన్ బి కాంప్లెక్స్, ఫైబర్, జింక్ వంటి పోషకాలు మెదడుకు మేలు చేస్తాయి.