పెరుగు జీర్ణాశయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

వేసవి రోజుల్లో కడుపు చల్లగా ఉండాలంటే రోజుకు ఒక్కసారైనా పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి

పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో దీనిని తినడం ఉత్తమం.

ఓట్స్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

ఓట్ ఊక జీర్ణాశయం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఖనిజాలు, విటమిన్లను కలిగి ఉంటుంది. ఓట్ బ్రాన్‌తో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.

నీటికి బదులుగా రుచికరమైన హెర్బల్ డ్రింక్స్ తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు.

పుదీనా, నిమ్మకాయలో శీతలీకరణ గుణాలు ఉన్నాయి. ఒక జగ్గులో నీళ్ళు నింపి దానికి పుదీనా ఆకులు, నిమ్మరసం కలపాలి.

ఇందులో నచ్చిన పండ్లను కూడా యాడ్ చేయొచ్చు. బాగా మిక్స్ చేసి కొంత సమయం తర్వాత తాగాలి.