ఆధునిక కాలంలో చాలా మంది పురుషులు వంధ్యత్వ సమస్యతో పోరాడుతున్నారు. కొన్నిసార్లు ఎక్కువ మందులు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం.

ఎక్కువగా అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, చెడు జీవనశైలి వల్ల సంతానలేమి సమస్య పెరుగుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా, పురుషులు సంతానోత్పత్తిని పెంచుకోవచ్చు. ఇంకా శరీరాన్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటే.. పురుషుల్లో వంధత్వ సమస్య రాదని.. లైంగిక శక్తి కూడా పెరుగుతుందని పేర్కొంటున్నారు

బయట దొరికే ప్రాసెస్డ్ మీట్ శరీరానికి హానికరం. దీన్ని తీసుకోవడం వల్ల పురుషుల్లో సంతానలేమి సమస్య వస్తుంది. స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గుతుంది.

రోజూ తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల పురుషుల్లో వంధ్యత్వం పెరుగుతుంది. ఇంకా బరువు పెరగడం, మధుమేహం సమస్య కూడా వస్తుంది.

అధిక ఉప్పు ఉన్న ఆహారాలు పురుషులలో వంధ్యత్వాన్ని పెంచుతాయి. అందుకే సోడియం ఆహారానికి దూరంగా ఉండండి

ధూమపానం, మద్యపానం పురుషులలో వంధ్యత్వానికి అతిపెద్ద కారణం. ఇవి రెండింటి వల్ల స్పెర్మ్ కౌంట్, నాణ్యత తగ్గుతుంది.