ప్రస్తుతం రోగనిరోధక శక్తి ఇచ్చే ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు
మన జీవనశైలిని మార్చుకుంటే వైద్యుల వద్దకు వెళ్లకుండా ఉండవచ్చు
కొన్ని ఆహార పదార్థాలను క్రమంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతి రోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది
పప్పు దినుసుల్లో విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ, విటమిన్ ఈ, మెగ్నిషియం, ఐరన్, జింక్ కూడా లభిస్తాయి
మిల్లెట్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపర్చడంలో ఇవి ఎంతగానో సహాయ పడతాయి. బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఆహారం
కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి
వివిధ రకాల నొప్పుల నివారణ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో పుష్కలంగా లభిస్తాయి