గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ ఉన్నవారు గుడ్లు తినొచ్చా? ఇవి తెలుసుకోండి
Krishna
24 May 2026
ఎసిడిటీ సమస్య ఉన్నవారికి గుడ్డులోని తెల్లసొన చాలా మంచిది. ఇందులో కేవలం లీన్ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. కొవ్వులు ఉండవు. అందువల్ల ఇది జీర్ణాశయంపై ఎలాంటి ఒత్తిడి పడనీయకుండా చాలా తేలికగా జీర్ణమవుతుంది.
గుడ్డులోని తెల్లసొన
గుడ్డులోని పచ్చసొనలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. జీర్ణాశయంలో కొవ్వులు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల కడుపులో యాసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అయి గుండెల్లో మంట పెరిగే అవకాశం ఉంది.
పచ్చసొన
గ్యాస్ సమస్యలు ఉన్నవారు గుడ్లను ఆమ్లెట్ లేదా ఫ్రై రూపంలో కాకుండా కేవలం ఉడికించి తినడం మంచిది. నూనె లేదా బటర్ అస్సలు వాడకుండా నీటితో తయారుచేసే పోచ్డ్ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు.
ఉడికించిన గుడ్లు
గుడ్డును వండేటప్పుడు ఎక్కువ నూనె, కారం, గరం మసాలాలు లేదా పెప్పర్ వంటివి అస్సలు జోడించకూడదు. ఇవి కడుపులోని అల్సర్లను మరింత రేకెత్తించి తీవ్రమైన కడుపునొప్పికి, ఎసిడిటీకి దారితీస్తాయి.
మసాలాలు, నూనెలు
కొంతమంది హాఫ్ బాయిల్డ్ లేదా సరిగ్గా ఉడకని గుడ్లను తింటుంటారు. కానీ అల్సర్, గ్యాస్ ఉన్నవారు గుడ్లను పూర్తిగా ఉడికించి మాత్రమే తినాలి. సగం ఉడికిన గుడ్ల వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.
సగం ఉడికిన గుడ్లు
అల్సర్ లేదా ఎసిడిటీ ఉన్నవారు ఒకేసారి ఎక్కువ మొత్తంలో గుడ్లు తినకూడదు. రోజుకు ఒక గుడ్డు తినడం సరిపోతుంది. ఒకేసారి ఎక్కువ గుడ్లు తింటే జీర్ణాశయంపై భారం పడి గ్యాస్ ఇబ్బంది తీవ్రమవుతుంది.
నియంత్రణ అవసరం
గుడ్లను బ్రేక్‌ఫాస్ట్‌లో లేదా మధ్యాహ్నం లంచ్‌లో తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. రాత్రిపూట మరీ ఆలస్యంగా గుడ్లు తినడం వల్ల నిద్రపోయే సమయంలో జీర్ణక్రియ మందగించి, తీవ్రమైన ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
రాత్రిపూట ఆలస్యంగా
కొంతమందికి గుడ్లు తిన్న వెంటనే సహజంగానే గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం వచ్చే గుణం ఉంటుంది. కాబట్టి గుడ్డు తిన్న తర్వాత మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గమనించండి.