రెడ్‌ గోల్డ్‌..! యాపిల్‌ ధరతో పోటీపడుతోన్న టమాట

నెలరోజుల క్రితం రూ.వందకు నాలుగు కిలోల చొప్పున అమ్మిన టమాటా ధరలకు రెక్కలొచ్చాయి

ఇతర కూరగాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి

టమాటా కిలో రూ.120. సూపర్‌ మార్కెట్లలోనైతే రూ.140 అమ్ముతున్నారు

పావుకిలో కొనాలంటే రూ.30 ఇచ్చుకోవాల్సిందే

పచ్చిమిర్చి రకాన్ని బట్టి కిలో రూ.120 నుంచి 160 వరకు విక్రయిస్తున్నారు

అల్లం కిలో రూ.300, బీన్స్‌ నాణ్యతను బట్టి రూ.120 నుంచి రూ.160 వరకు ధర పలుకుతోంది

ఇక చిక్కుడు కాయలు కిలో రూ.80 నుంచి రూ.100

బెండకాయలు, బీరకాయల ధరలు కూడా కిలో రూ.60 నుంచి 80వరకు పెరిగాయి