భోజనం చేసిన తర్వాత ఈ తప్పులు వద్దు..

January 31, 2024

TV9 Telugu

మనలో చాలామంది భోజనం చేసిన తర్వాత తెలిసో.. తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. అవన్నీ మన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంటాయి

కొంతమంది భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు

భోజనం తర్వాత టీ లేదా కాఫీ తాగితే జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుందట. ఈ అలవాటు ఉన్న వారు ఇకపై దీనిని మార్చుకోవడం మంచిది

మరికొంతమందికి ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ తర్వాత లేదా సాయంత్రం భోజనం చేసిన వెంటనే స్నానం చేసే అలవాటు ఉంటుంది. దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి

ఫలితంగా పొట్టలో వ్యర్థాలు పేరుకుపోయి స్కిన్‌ అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. వీలైనంత వరకూ భోజనానికి ముందే స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి

అలాగే రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండటం కూడా చాలా అవసరం. అయితే భోజనం చేసే సమయంలో మాత్రం ఎక్కువ నీళ్లు తాగడం మానుకోవాలి. ఇది జీర్ణ స్రావాలను పలుచన చేస్తుంది 

అందువల్ల ఆహారం జీర్ణమయ్యేందుకు చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా శరీరంలో టాక్సిన్లు కూడా విపరీతంగా పెరుగుతాయట. మరైతే  నీళ్లు ఎలా తాగాలి అని అనుకుంటున్నారా?

భోజనానికి గంట ముందూ లేదా తిన్నాక గంట తరవాత నీటిని తాగితే మంచిది. అలాగే భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు. ఇలా చేయడం వల్ల కొవ్వులు నిల్వ పెరిగి బరువు పెరుగుతుంటారు. భోజనం చేశాక కనీసం అరగంట పాటు నడవాలి