సంపూర్ణ ఆరోగ్యం కోసం నువ్వులు..
నువ్వులు సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఉంటాయి.
వీటిని ప్రతిరోజు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ప్రతిరోజు ఒక పిడికెడు నువ్వులు , బెల్లంతో కలిపి చేసిన నువ్వుల లడ్డూ ఒకటి తింటే చాలు శరీరానికి సరిపడా పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.
రక్తహీనత ఉన్నవారు నువ్వులు వేయించుకుని బెల్లంతో తినడం మంచిది.
ముఖ్యంగా ఇది శరీరంలో ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది.
మంచి కొవ్వును అందించడంతో పాటు శరీర బరువు తగ్గించడంలో సహాయం చేస్తుంది.
నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. కాల్షియం లోపం ఉన్న గర్భిణులు వీటిని తినడం వల్ల కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు.
రోజు ఉదయాన్నే వీటిని తినడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
నువ్వులు తినడం వల్ల గర్భస్రావం జరగడం లేదా శరీరంలో వేడి చేస్తుందనడం వంటివన్ని అపోహలు మాత్రమే...
ఇక్కడ క్లిక్ చెయ్యండి