వర్షాకాలంలో నెయ్యిని తప్పనిసరిగా తినాలట..ఎందుకో తెలుసా..?
ప్రతి ఇంట్లో నెయ్యిని విరివిగా ఉపయోగిస్తారు. వర్షాకాలంలో నెయ్యి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా?
వర్షాకాలంలో నెయ్యి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
నెయ్యిలోని యాంటీఆక్సిడెంట్లు జలుబు, వైరల్ ఫీవర్‌తో పోరాడటానికి సహాయపడతాయి.
నెయ్యి తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఏర్పడుతుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది.
నెయ్యి తీసుకోవడం వల్ల జీవక్రియ కూడా పెరుగుతుంది. ఇందులో ఉండే మీడియం చైన్ ఫ్యాటీ మెటబాలిజానికి దారి తీస్తుంది.
మెదడు పదును పెట్టేందుకు నెయ్యి తీసుకోవడం చాలా మంచిది. నెయ్యిలోని ఒమేగా-3 మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
మీ ఆహారంలో నెయ్యిని చేర్చుకోవటం వల్ల మూడ్ స్వింగ్స్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
నెయ్యి శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, డి, ఇ, కె2లను అందిస్తుంది. ఈ విటమిన్లు శరీర ఆరోగ్యానికి అద్భుతమైనవి.
నెయ్యిలో కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
వర్షాకాలంలో ఆరోగ్యకరమైన చర్మం, జుట్టును నిర్వహించడానికి ఇది సహాయపడుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..