ఎండు ద్రాక్షతో గుండె పదిలం

మన గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎండు ద్రాక్ష మనకు చాలా బాగా సహాయపడుతుంది.

అధిక రక్తపోటు, ఛాతిలో నొప్పి ఇంకా అధిక కొలెస్ట్రాల్‌ వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి ఎంతో సహాయపడతాయి.

ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల మన శరీరంలో నైటిక్ర్‌ యాసిడ్‌ ఎక్కువగా ప్రొడ్యూస్‌ అవుతుంది.

దీంతో రక్తపోటు చాలా ఈజీగా అదుపులో ఉండడంతో పాటు రక్తనాళాలు కూడా ఎక్కువగా వ్యాకోచిస్తాయి.

గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రక్తహీనతను, ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది.

అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఎండు ద్రాక్షమనకు చాలా బాగా సహాయపడుతుంది.

ఇక ప్రతి రోజూ 6 నుండి 8 ఎండు ద్రాక్షలను రాత్రివడుకునే ముందు గోరు వెచ్చని నీటిలో వేసి నానబెట్టాలి.

పొద్దున్నే ఈ నీటిని తాగి ఎండు ద్రాక్షను నమిలి తినాలి. ఇలా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది.