మిరియాలను మీ డైట్ లో చేర్చుకుంటే.. మతిపరుపు ఖతమ్ బై బై అవుతుంది..
TV9 Telugu
13 February 2024
శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో మెదడు కూడా ఒకటి. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే ఇతర శరీర భాగాలు కూడా సక్రమంగా పని చేస్తాయి.
ఈ మధ్య చాలా మంది మతి మరుపు, అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. మెదడు కణాలు చనిపోకుండా, వాటిలో ఇన్ ఫ్లమేషన్ రాకుండా చూసుకోవాలి.
మెదడు కణాలు కనుక చనిపోతూ ఉంటే చాలా నష్టం జరుగుతుంది. బ్రెయిన్‌లో కొన్ని రకాల హానికర ప్రోటీన్లు రిలీజ్ అయి మెదడు కణాలను నశింపజేస్తూ ఉంటాయి.
ఇలాంటి వాటి నుంచి మెదడు కణాలను కాపాడాలంటే.. మిరియాలు చక్కగా పని చేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
మిరియాల్లో పెప్పరిన్ ఉంటుంది. ఇది బ్రెయిన్ కణాలను నాశనం చేసే ప్రోటీన్‌ను నశింపజేస్తుంది. తద్వారా మెదడుకు మేలు.
మిరియాల్లో పెప్పరిన్మ తిమరుపు, డిమెన్షియా వంటివి రాకుండా చూస్తుంది. వంటల్లో కారానికి బదులుగా మిరియాలను వాడటం ఉత్తమం.
సలాడ్స్, సూప్స్, స్నాక్స్ వంటి వాటిల్లో మిరియాల పొడిని వాడటం వల్ల మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయన్నది వైద్యుల మాట.
అయితే మిరియాలను మరీ ఎక్కువగా కాకుండా మితంగా ఉపయోగించాలని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి