10 December 2023

చ‌లికాలంలో టీ తాగుతున్నారా.! అయితే ఇది మీకోసమే..

చాలా మంది ఉదయం టీ తాగిన తర్వాతే రోజువారీ దినచర్య ప్రారంభిస్తారు.

చ‌లికాలంలో అయితే బెడ్‌ మీద నుంచి దిగగానే గరం ఛాయ్ గొంతులో దిగాల్సిందే.

బ్లాక్ టీ, మ‌సాలా టీ, గ్రీన్ టీ, మిల్క్ టీ ఇలా టీ ఏదైనా వారి అభిరుచికి త‌గిన టీ సేవిస్తుంటారు. 

అల్లం, దాల్చిన చెక్క‌, మిరియాలు వంటి మ‌సాలా టీని ప‌లువురు ఇష్టపడుతుంటారు.

మ‌సాల దినుసుల‌తో కూడిన టీని అధికంగా తీసుకుంటే ఆరోగ్యంపై ఎఫెక్ట్‌ తప్పదంటున్నారు నిపుణులు.

మసాలా టీని పరిమితంగా తీసుకుంటూ బ్యాలెన్స్ పాటించ‌డం ఆరోగ్యానికి అన్ని విధాలా మేలంటున్నారు. 

చ‌లికాలంలో మ‌సాలా టీని సేవిస్తే రోగ‌నిరోధ‌క శ‌క్తి బలపడుతుంది. జీవ‌క్రియ‌ల వేగం పెర‌గ‌డం వంటి మరెన్నో ఆరోగ్యకరమైన ఉపయోగాలున్నాయి. 

అయితే మసాలా టీని ఎక్కువ సార్లు సేవిస్తే మాత్రం హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ తప్పవంటున్నారు నిపుణులు. 

మ‌సాలా టీని మోతాదుకు మించి తాగితే అజీర్తి, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి సమస్యలు తలెత్తుతాయి.