TV9 Telugu
మెంతికూరతో ఎన్ని లాభాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
16 March 2024
సమ్మర్ లో ఆకుకూరలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పలు రకాల ఆరోగ్య ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు.
ఆకు కూరలు సూర్యుని వల్ల కలిగే హీట్ స్ట్రోక్ ద్వారా రక్షిస్తుంది. అందులో మెంతికూర మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎండాకాలంలో సాధారణంగా వేధించే డీహైడ్రేషన్‌కి మెంతికూరలో కేలరీలు తక్కువగా ఉంటాయి, కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది.
సమ్మర్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
ఎండాకాలంలో తినడానికి చాలా ఆరోగ్యకరమైన ఆకుకూరల్లో మెంతి కూర ఒకటి. మెంతులుకూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.
మెంతి కూర కూడా చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఇందులో కాల్షియం, ఐరన్, అనేక ఇతర పోషకాలు ఉన్నాయి.
మెంతికూ తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుకుంటూ, తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
కడుపు ఉబ్బరం, అసిడిటీ సమస్యలతో ఇబ్బందులు పడే వారు మెంతికూర తీసుకోవడం వల్ల చాలా త్వరగా ఉపశమనం పొందుతారు.
బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ మెంతికూర తింటే ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెప్పొచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి