ఆకు కూరలు: బచ్చలికూర సహా ఇతర ఆకు కూరలలో విటమిన్లు ఏ, సీ, కే ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
పసుపు: పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఊపిరితిత్తుల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
గ్రీన్ టీ: ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
నారింజ: ఈ సిట్రస్ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. శ్వాసకోస ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించడంలో, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
బాదం, వాల్‌నట్, బ్రెజిల్ నట్స్‌లో విటమిన్ ఇ, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి.
యాపిల్స్: ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, విటమిన్లు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
బెర్రీలు: స్ట్రాబెర్రీస్, క్రాన్‌బెర్రీస్‌లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టాల నుంచి ఊపిరితిత్తుల కణజాలాలను రక్షిస్తాయి.