పొటాటో చిప్స్‌కి బదులు ఇవి తీసుకుంటే ఆరోగ్యం మీ చెంతనే..
TV9 Telugu
03 February 2024
పలు వెరైటీల్లో నోరూరించే చిప్స్ అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అదే పనిగా తింటే బరువు పెరగడం, బీపీ, హృద్రోగ సమస్యలు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు.
అయితే హాట్ స్నాక్స్ కోసం పొటాటో చిప్స్ కు బదులుగా ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయని సూచిస్తున్నారు నిపుణులు.
అయిదు ఆరోగ్యకర ప్రత్యామ్నాయ స్నాక్స్‌ను నిరభ్యంతరంగా తీసుకోవచ్చని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణలు.
ముందుగా బీట్రూట్ చిప్స్‌ను టేస్టీ, హెల్ధీ చిప్స్‌గా ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు అంటున్నారు వైద్యులు.
బీట్రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, పోషకాలు శరీరానికి మేలు చేస్తాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
దీంతో పాటు ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే స్వీట్ పొటాటో చిప్స్‌ను కూడా ఇంట్లోనే తయారుచేసుకుని తినవచ్చు.
ఆలూ చిప్స్‌కు బదులు బీట్రూట్ చిప్స్, స్వీట్ పొటాటో చిప్స్, గుమ్మడి చిప్స్, బనానా చిప్స్, క్యారట్ చిప్స్ తీసుకోవచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి