TV9 Telugu
ఇండియన్ ఇడ్లీ ఎంత ఫెమోసో.. అంతకంటే డేంజర్..!
07 March 2024
సౌత్ లో ఇష్టమైన అల్పాహారంలో ఇడ్లీదే అగ్రస్థానం. వేడి వేడి ఇడ్లీ.. కొద్దిగా నెయ్యి, కారంపొడి వేసి తింటే.. ఆహా ఆ టేస్టే వేరు!
అలాంటి ఇడ్లీ కారణంగా ఆరోగ్య సమస్యలే కాదు, జీవవైవిధ్య ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది.
ఇదొక్కటే కాదు ప్రపంచవ్యాప్తంగా 151 వంటకాలు జీవ వైవిధ్యానికి ముప్పుగా పరిణమించాయని ఓ అధ్యయనం పేర్కొంది.
వాటిలో ఇడ్లీతోపాటు చనా మసాలా , రాజ్మా, చికెన్ జాల్‌ఫ్రెజి , రాజ్మా కూర , ఇంకా పలు రకాల వంటకాలు కూడా ఉన్నాయి.
పర్యావరణానికి ముప్పుగా పరిణమించే మొదటి 25 ఆహారాలు భారతీయ ప్రజలు ఇష్టంగా తినే వంటకలు అయ్యి ఉండడం విశేషం.
జీవవైవిధ్యానికి ముప్పు కలిగించే ఆహారాల లిస్ట్‌లో ఇడ్లీ ఆరోస్థానంలో ఉంది. స్పానిష్ డిష్ ‘లెచాజో’ అగ్రస్థానంలో ఉంది.
రెండో స్థానంలో బ్రెజిల్‌కు చెందిన మీట్ సెంట్రిక్ ఆఫెరింగ్స్ ఉంది. ఇండియన్ రాజ్మా కూర ఏడో స్థానంలో ఉంది.
ఈ అధ్యయన వివరాలు సింగపూర్ యూనివర్సిటీ నిర్వహించే ఓపెన్ యాక్సెస్ జర్నల్ ప్లాస్ PLOS లో ప్రచురితమైంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి