ఉల్లిపాయలు కొసేటప్పుడు మేకప్ పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..

సాధారణంగా ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్లలో నీళ్లు రావడం మామూలు విషయమే.

కన్నీళ్లకు ప్రధాన కారణం ఉల్లిపాయల నుంచి విడుదలయ్యే సిన్-ప్రొపాంథైల్-ఎస్-ఆక్సైడ్ రసాయనం.

ఈ రసాయనం కళ్లలో ఉండే లాక్రిమల్ గ్రంధిని ప్రేరేపిస్తుంది. దీని కారణంగా కళ్లలో నుండి నీళ్లు కారుతాయి.

ఉల్లిపాయలు కోసేటప్పుడు  కత్తిపై కొంచెం నిమ్మరసం రాయండి. దాంతో కోసేటప్పుడు ఎంజైమ్ కళ్లను ప్రభావితం చేయదు.

ఉల్లిపాయను కొసే ముందు 15 నుండి 20 నిమిషాలు నీటిలో నానబెట్టండి. ఇలా చేస్తే ఉల్లిపాయలో ఉండే సల్ఫ్యూరిక్ నీటిలో చేరుతుంది.

ఉల్లిపాయలు కోసే సమయంలో కొవ్వొత్తి లేదా దీపం వెలిగించండి. దీంతో ఉల్లిపాయ నుంచి విడుదలయ్యే గ్యాస్ దీపం వైపు వెళ్తుంది.

ఉల్లిపాయలను కోసే ముందు వాటిని ఒలిచి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. ఇలా చేస్తే కళ్లకు మంటపుట్టదు. కన్నీళ్లు రావు.

ఉల్లిపాయలను కోసే ముందు వెనిగర్‌లో ముంచండి. ఇలా చేస్తే ఉల్లిపాయలు కోసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఉల్లిపాయలు కోసేటప్పుడు ఆవిరి పట్టడం మంచిది. ఇలా చేస్తే ఉల్లిపాయను కోసేటప్పుడు విడుదలయ్యే ఎంజైమ్ కళ్లకు హానికలిగించదు.

ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు పదునైన కత్తిని ఉపయోగించాలి. దీంతో తొందరగా ఉల్లిపాయలను కట్ చేయవచ్చు.