చక్కెరను ఎక్కువ తింటే ఈ జబ్బులు తప్పవు.. తస్మాత్ జాగ్రత్త..!
TV9 Telugu
07 January 2024
చక్కెర మన శక్తికి మూలం. కానీ ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, టీ, కాఫీ మొదలైన వాటిలో చక్కెర ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది శరీర కొవ్వును పెంచుతుంది. దీని వల్ల అకస్మాత్తుగా బరువు పెరుగుతారు.
బరువు పెరగడం వల్ల మీ గుండె, కాలేయం రెండింటికీ మంచిది కాదు. అనారోగ్యకరమైన బరువు కూడా మిమ్మల్ని ఊబకాయానికి గురిచేస్తుంది.
మీ ఆహారంలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నో చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మొటిమలు, అకాల వృద్ధాప్యం. మీ హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.
మీ రోజువారి ఆహారంలో చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం తగ్గుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. ఇది డయాబెటిస్ కు అతిపెద్ద కారణం
హార్మోన్లు సరిగ్గా ఉంటేనే మన శరీరం సక్రమంగా పనిచేస్తుంది. కానీ మీ ఆహారంలో చక్కెర ఎక్కువగా ఉంటే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
చక్కెరను ఎక్కువగా తినడం వల్ల.. మీకు చక్కెరను పదేపదే తినాలన్న కోరిక కలుగుతుంది. దీనివల్ల మీ రక్తంలో చక్కెర స్థాయి మారడం ప్రారంభమవుతుంది.
ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం, తగ్గడం వల్ల అలసట సమస్య వస్తుంది.
ఒక్క మాటాలో చెప్పాలంటే.. అతిగా చక్కెర తినటం వల్ల శరీరంలో కొవ్వు పెరగడం, స్తూలకాయం రావడం, మధుమేహం రావడం, దంతాల్లో పుప్పి తయారవడం లాంటి ఎన్నో సమస్యలకు ఇది మూల కారణం అవుతుంది.