26 September 2023
రకరకాల పదార్ధాలను తినే ఆహారంలో చేర్చుకుంటారు. ఏదైనా ఆహారం తిన్న తరువాత నీటిని తాగడం సర్వసాధారణం. స్వీట్స్ తిన్న తరువాత నీటిని తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
తీపి పదార్థాలను తిన్న తరువాత ఎవరికైనా నీటిని తాగాలనిపిస్తుంది. ఇలా నీటిని తాగడం వల్ల రక్తంలో షుగర్ వేగంగా పెరుగుతుందని చెబుతున్నారు.
వాస్తవానికి తీపిని తిన్న తరువాత రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. ఇక స్వీట్ తిని నీరు తాగితే.. నీటి ద్వారా గ్లూకోజ్ అధికంగా శోషించబడి రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుందట.
తీపి పదార్ధాన్ని తిన్న తరువాత నీటిని తాగితే ఎక్కువగా టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందట.
షుగర్ వ్యాధిగ్రస్తులు స్వీట్స్ తిన్న తరువాతపొరపాటున కూడా నీటిని తాగకూడదు. తప్పనిసరిగా నీటిని తాగాలనిపిస్తే నోట్లో నీరు పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయాలి.
మీరు బదులు నోట్లో ఉప్పు వేసుకోవచ్చు. లేదా పండ్ల రసాలను నీటికి బదులుగా తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
స్వీట్స్ తిన్న తర్వాత దాదాపు అరగంట తర్వాత మాత్రమే నీటిని తాగాలని.. అప్పుడు శరీరానికి ఎటువంటి హాని కలుగదని చెబుతున్నారు