పెరుగుతో నిజంగా ఇన్ని లాభాలున్నాయా.? 

05 February 2024

TV9 Telugu

ఎన్నో రకాల ప్రోటీన్స్‌, కాల్షియం, విటమిన్స్‌, మినరల్స్‌కు పెరుగు పెట్టింది పేరు. శరీరానికి అవసరమైన పోషకాలు పెరుగు ద్వారా లభిస్తాయి.  

గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో పెరుగు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మంచి కొవ్వు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

తరచూ తలనొప్పితో ఇబ్బందిపడే వారు పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పెరుగులోని కాల్షియం తలనొప్పి తగ్గించడంలో క్రీయాశీలకంగా ఉపయోగపడుతుంది. 

ఇక పెరుగులోని కాల్షియం ఎముకలు బలంగా మారుతాయి. దంతాలు ఆరోగ్యంగా మారుతాయి. అంతేకాకుండా పెరుగు రోగ నిరోధశక్తిని పెంచుతుంది. 

గుండెలో మంట, అజీర్తి వంటి సమస్యలకు పెరుగుతో చెక్‌ పెట్టొచ్చు. పెరుగలోని ప్రోబయోటిక్స్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అసిడీ, గ్యాస్‌, మలబద్ధకం వంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. 

చర్మ ఆరోగ్యానికి కూడా పెరుగు దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఇందులోని ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతాయి. చర్మం మెరిసేలా మారడంలో పెరుగు ఉపయోగపడుతుంది. 

ఇక అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు రోజు ఆహారంలో పెరుగును భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల రక్త పోటు అదుపులోకి వస్తుందని సూచిస్తున్నారు. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం