30 September 2023

గ్రీన్‌ టీ వల్ల ఉపయోగాలేమో కానీ అనర్ధాలు కూడా ఎక్కువే..

గ్రీన్‌ టీ తాగడం వల్ల ఉపయోగాలేమో కానీ ఎక్కువగా తాగడం వల్ల మాత్రం కాలేయ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా గ్రీన్‌ టీ తాగేటప్పుడు గర్భిణులు, పాలిచ్చే తల్లులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

గర్భిణులు రోజుకు 200 మిల్లీగ్రాములకు మించి కెఫిన్ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంటుంది. 

గ్రీన్ టీలో ఉండే కెఫిన్ పట్ల గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సార్లు గ్రీన్‌ టీ తాగడం వల్ల ఎక్కువ కెఫిన్‌ శరీరంలోకి చేరుతుంది.

గ్రీన్ టీలో ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ హెల్తీ డ్రింక్ అయినప్పటికీ, గర్భిణులు ఎక్కువ మొత్తంలో గ్రీన్ టీ తీసుకోకూడదు. 

గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో గ్రీన్ టీని ముట్టుకోనే వద్దు. ఇక కెఫెన్‌ ఎక్కువగా ఉండే కాఫీ జోలికి అసలే పోవద్దు. 

గర్భిణీలు గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల పాల స్రావం తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాలేయ వ్యాధులు ఉన్నవారు గ్రీన్‌ టీని అసలు ముట్టుకోకపోవడమే బెటర్‌.  గ్రీన్‌ టీ తాగేవారికి ఇతర మందుల వల్ల రివర్స్‌ ఎఫెక్ట్‌ చూపే ప్రమాదం ఉందంటున్నారు.

గ్రీన్‌ టీ ఎక్కువగా తీసుకోవటం వల్ల తలనొప్పి వచ్చే అవకాశం మెండు. రక్తపోటు అమాంతం తగ్గిపోయి అశాంతికి కారణం అవుతుంది.