నిత్యం పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో రక్తపోటు కూడా ఒకటి. దీన్ని మందులు లేకుండానే ఇలా తగ్గించుకోవచ్చు.

మందులు వాడకుండానే బీపీని తగ్గించుకోండిలా..

రక్తపోటును తగ్గించడానికి ఉల్లిపాయ తినవచ్చు. ఇందులోని ఫ్లేవొనాల్ బీపీని తగ్గిస్తుంది.

పుచ్చకాయలోని ఫైబర్, లైకోపిన్ పోషకాలు రక్తపోటును తగ్గించడంలో సహకరిస్తాయి.

పోటాషియం, ఫైబర్, ఫోలేట్ పోషకాలున్న బచ్చలి కూర కూడా రక్తపోటును తగ్గించగలదు.

క్యారెట్‌లోని బీటా కెరోటిన్ బ్లడ్ ప్రెజర్‌ని నియంత్రిస్తుంది.

బ్లాక్ టీలో ఎక్కువగా ఉండే ఫ్లేవనాయిడ్స్ కూడా హైబీపీని తగ్గించగలవు.

సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా రక్తపోటును నియంత్రించి, గుండెను కాపాడతాయి.

ఆరెంజ్ కూడా రక్తపోటును నియంత్రగలదు.

యాపిల్స్, బెర్రీస్, కివీ, ఫైనాపిల్ వంటి ఫ్లేవనాయిడ్స్‌ కలిగిన పండ్లను రక్తపోటు నియంత్రణ కోసం తీసుకోవచ్చు.

బీట్‌రూట్‌కి హైపర్ టెన్షన్ నుంచి ఉపశమనం కలిగించగల శక్తి ఉంది.