కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగితే సరిపోతుందంటారు.
కొబ్బరి నీళ్లు మధుమేహం వ్యాధిగ్రస్థులకు సైతం చాలా మంచివి. రక్తంలో చక్కెర శాతం తగ్గించే గుణాలు ఇందులో ఉంటాయి.
ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషయం, మాంగనీస్, విటమిన్ సి, ఎల్ అర్జినైన్ కారణంగా బ్లడ్ షుగర్ ప్రభావం తగ్గుతుంది.
కొబ్బరి నీళ్లు తీపిగా ఉన్నా ఇది ప్రకృతి సహజసిద్ధమైంది. అంటే నేచురల్ షుగర్ కంటెంట్ మాత్రమే ఉంటుంది.
అంతేకాకుండా కొబ్బరి నీళ్లు శరీరంలో ప్రమాదకరమైన ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తాయి.
గుండె వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది. కొబ్బరి నీళ్లు రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో ట్రై గ్లిసరైడ్స్, కొలెస్ట్రాల్, లివర్ ఫ్యాట్ సమస్యలు తగ్గుతాయి.
కొబ్బరి నీళ్లలో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో ప్రీ రాడికల్స్ నిర్మూలమై కణాలు దెబ్బతినకుండా ఉంటాయి.
మధుమేహం వ్యాధిగ్రస్థుల్లో ఎదరయ్యే దృష్టి, కండరాల నొప్పులు దూరమౌతాయి. కొబ్బరి నీళ్లలో ఉండే అన్ని రకాల మినరల్స్ , విటమిన్ల వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ గణనీయంగా పెరుగుతాయి.