డయాబెటిక్ పేషంట్లకు ఇక సూది మందుతో పన్లేదు..

04 November 2023

హైదరాబాద్ సంస్థ నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్ ఘనత.. ఇన్సులిన్ స్ప్రే ‘ఓజులిన్’ అభివృద్ధి

మధుమేహంతో బాధపడుతూ నిత్యం ఇన్సులిన్ ఎక్కించుకునే వారికి ఇది శుభవార్తే.  సూది ద్వారా ఇన్సులిన్ ఎక్కించుకునే కష్టాలు ఇక తీరనున్నాయి.

40కిపైగా దేశాల్లో ఇప్పటికే దీనికి అంతర్జాతీయ పేటెంట్ లభించింది.  మన దేశంలో భద్రతా పరమైన పరీక్షల కోసం..

సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో)కు కంపెనీ దరఖాస్తు చేసుకుంది. 

ఈ స్ప్రే కనుక అందుబాటులోకి వస్తే మధుమేహ చికిత్సలో నొప్పిలేని ప్రత్యామ్నాయం లభించినట్టే.

ఇటీవల శునకాలపై నిర్వహించిన పరీక్షల్లో 91 శాతానికిపైగా బయో అవైలబిలిటీని ఓజులిన్ ప్రదర్శించింది.

2024-25 నాటికి కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు కూడా ఓరల్ ఇన్సులిన్ స్ప్రేను ఆవిష్కరించేందుకు కంపెనీ ప్రయత్నాలు ప్రారంభించింది.