మద్యం తాగితే పిల్లలు పుట్టరా.?

ప్రస్తుతం ఆడ, మగ తేడా లేకుండా చాలామంది మద్యం తీసుకుంటున్నారు.

మహిళలు ఎక్కువగా మద్యం సేవించడం వల్ల పిల్లలు పుట్టడంలో ఏదైనా ఇబ్బంది ఉంటుందా.?

అనే సందేహం చాలామందికి ఉంటుంది. మహిళలు మద్యం తాగితే ఏం అవుతుందో తెలుసుకుందాం.

మహిళలు మద్యం సేవించడం వల్ల ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్లపై ప్రభావం పడుతుంది.

అలాగే మహిళల్లో గర్భధారణ సామర్థ్యాన్ని కూడా మద్యపానం తగ్గిస్తుందని గైనకాలజిస్టు, చెబుతున్నారు.

వారానికి 6-14సార్లు మద్యం సేవించిన మహిళల్లో 25 శాతం వరకు సంతాన సామర్థ్యం తగ్గినట్లు కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.

ఈ ఆల్కహాల్‌ అండం ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుంది.

దీంతో నెలసరి సమస్యల్లో కూడా ఇబ్బంది రావడం వల్ల గర్భం దాల్చడం కూడా కష్టమవుతుంది.

ఒకవేళ గర్భం దాల్చినా అబార్షన్‌ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని గైనకాలజిస్టు హెచ్చరిస్తున్నారు.

దీంతో పాటు ఎండోమెట్రియాసిస్‌ అనే వ్యాధి రావడంతో పాటు కడుపులో నొప్పి వచ్చి సంతాన సమస్యలు కూడా వస్తాయట.

కాబట్టి మహిళలు వీలైనంత వరకు మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది.