01 December 2023
చలికాలంలో ఆహారాన్ని దూరం పెడుతున్నారా.? జాగ్రత్త.!
చలికాలంలో రోజంతా చల్లని వాతావరణం ఉంటుంది. దీంతో మన శరీరంలో రెండు విషయాలు జరిగే అవకాశం ఉంది.
ఒకటి, సూక్ష్మజీవులు జీవించడానికి వాటి పునరుత్పత్తి ఇది సరైన వాతావరణం, రెండు, తక్కువ ఉష్ణోగ్రత మన శరీర రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది.
చలికాలంలో మనం అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువ.
చలికాలంలో మనం తీసుకునే ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి చలికాలంలో తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి.
చలికాలంలో కూడా శీతల పానీయాలు, సోడాలు తాగే అలవాటు ఉన్నట్లయితే, మీ అలవాటును మార్చుకోండి.
ముందుగా ఆహారాన్ని శరీర ఉష్ణోగ్రతకు తీసుకువెళ్లి ఆ తర్వాత జీర్ణం చేయాలి. ఇందుకు మీ శరీరం రెండింతలు కష్టపడాలి.
చలికాలంలో ఫ్రిజ్‌లోని శీతల పానీయాలు తాగిన తర్వాత జలుబు లేదా గొంతు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది.
చలికాలంలో చల్లటి పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు వస్తుంది. కాబట్టి గది ఉష్ణోగ్రతకు చేరుకున్న పెరుగునే తినడం అలవాటు చేసుకోవాలి.
కానీ అది కూడా భోజనం వరకు మాత్రమే. రాత్రిపూట పెరుగు తినడం మానేయండి .
ఇక్కడ క్లిక్ చెయ్యండి