మెంతి గింజల్లో ఔషధ గుణాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. జుట్టు పెరుగుదల, జీర్ణక్రియ నుంచి బరువు తగ్గడం, డయాబెటిస్ వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.
ఒంట్లోని చెడు కొవ్వును కరిగించే లక్షణం మెంతులకు ఉందని చెబుతారు. ఊబకాయాన్ని తగ్గించుకోవాలని అనుకునేవారు, ఆహారంలో మెంతులు లేదా మెంతికూర చేర్చుకోవచ్చు.
జీర్ణ సంబంధమైన సమస్యలకు మెంతులు దివ్యౌషధం. జీర్ణ సమస్యలు తగ్గడమే కాకుండా ఆహారంలోని పోషకాలు కూడా ఒంటికి అందుతాయి.
రుతుక్రమంలో మహిళలకు వచ్చే కండరాల నొప్పులను తగ్గించడంలో మెంతులు సాయపడతాయి. ఐరన్ లోపాన్ని సరిదిద్దేందుకు కూడా ఉపయోగపడతాయి.
మెంతులకు ఆకలిని తగ్గించే గుణం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది తినేవారు నోరు కట్టేసుకోడానికి సాయపడుతాయి.
కఫం ఎక్కువగా ఉన్నవారు మెంతి గింజలను పొడిగా, నానబెట్టి, మొలకెత్తిన ఏ రూపంలో తీసుకున్న మంచిది. దగ్గును తగ్గించడంలో మెంతులు సమర్థవంతంగా పనిచేస్తాయి.
మెంతులలో జీరో క్యాలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతులు తీసుకుంటే మేలు జరుగుతుంది.ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.