వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్నో రకాలు.

ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ఎండ వేడిమికి డీలా పడిపోవాల్సిందే.

హెవీగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దు. లైట్ గా తక్కువ మోతాదులో మాత్రమే ఆహార పదార్థాలను తీసుకోండి.

నీళ్లు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తీసుకోండి. కమల పండ్లు, పుచ్చకాయలు, టమాటాలు వంటివి తీసుకుంటే మంచిది.

బయటకు వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ ని పెట్టుకోవడం వలన హానికరమైన యువి కిరణాల నుండి రక్షణ లభిస్తుంది.

వేసవికాలంలో ఆల్కహాల్ కెఫీన్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. వీటిని తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్య కలుగుతుంది.

వీలైనంతవరకు ఇంటిపట్టునే ఉండండి. ఉదయం 11 గంటలకు ముందు మాత్రమే పనులు చేసుకోండి. సాయంత్రం చల్లబడిన తర్వాతనే బయటకు వెళ్ళండి.