శీతాకాలంలో మీ పాదాలు మృదువుగా, అందంగా ఉంచుకోవాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

శీతాకాలంలో స్నానం చేసిన తర్వాత వెంటనే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు ఎల్లప్పుడూ తేమగా ఉంటాయి

ఎందుకంటే పాదాలను కడిగిన ప్రతిసారీ చర్మం దాని సహజ నూనెలను కోల్పోతుంది

చర్మం తేమగా ఉండాలంటే ఎక్కువసేపు స్నానం చేయకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

ఎక్కువ సేపు స్నానం చేయడం వల్ల చర్మం సహజసిద్ధమైన నూనెలను కోల్పోతుంది. ఫలితంగా చర్మం పొడిబారుతుంది

చాలా వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేయకూడదు. ఇలా చేయడం మూలంగా చర్మం సహజ నూనెలను కోల్పోతుంది

సన్‌స్క్రీన్‌ లోషన్‌ని ఉపయోగించడం వేసవిలో ఎంత ముఖ్యమో శీతాకాలంలో చర్మ సంరక్షణకు అంతే ముఖ్యం

అధికంగా నీళ్లు తాగడం మూలంగా చర్మాన్ని పొడిబారకుండా నివారించవచ్చు. చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటే కాంతివంతంగా కనిపిస్తుంది